బాల్కొండ: లక్ష్మి కాలువకు నీటి విడుదల..రైతుల హర్షం

బాల్కొండ: లక్ష్మి కాలువకు నీటి విడుదల..రైతుల హర్షం

బాల్కొండ, వెలుగు: ఆయకట్టు రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీరాంసాగర్‌‌‌‌ ప్రాజెక్టు నుంచి నిజామాబాద్​ జిల్లా బాల్కొండ మండలంలోని లక్ష్మి కాలువకు నీటి విడుదల ప్రారంభమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం అధికారులు లక్ష్మి కాలువ హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ నుంచి 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

దీంతో కాలువ పరిధిలోని ఆయకట్టు రైతుల్లో సాగుపై ఆశలు చిగురించాయి. కాలువలో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆయకట్టు ప్రాంతాలకు నీరు సక్రమంగా చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు.