రిజర్వాయర్లకు జలకళ: ఎస్సారెస్పీ, మేడిగడ్డకు పెరిగిన వరద

 రిజర్వాయర్లకు జలకళ: ఎస్సారెస్పీ, మేడిగడ్డకు పెరిగిన వరద

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: అల్ప పీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ఎస్పారెస్పీ ప్రాజెక్టులోకి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. శని, ఆదివారాల్లో 3,935 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్ లో కలిసింది. అంతకు ముందు దాదాపు నెల రోజుల్లో 1,013 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చింది. 

80.5 టీఎంసీల కెపాసిటీ గల ఎస్సారెస్పీలో ప్రస్తుతం 46.355 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రతి రోజు 1,892 క్యూసెక్కుల నీటిని కాకతీయ, సరస్వతీ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు అలీసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుత్ప లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు తరలిస్తున్నారు. 

మేడిగడ్డ వద్ద 35,890 క్యూసెక్కులు...

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : రెండు రోజులుగా మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 35,890 క్యుసెక్కుల వరద కొనసాగింది. ఇదే స్థాయిలో ఇన్ ప్లో, ఔట్ ప్లో ఉండగా బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసి గోదావరి ప్రవాహన్ని దిగువకు వదలుతున్నారు. వర్షాల కారణంగా గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో తీర ప్రాంత ప్రజలు నీటిలోకి వెళ్లొద్దని ఆఫీసర్లు హెచ్చరించారు.