బిహార్ను వీడని ముంపు కష్టాలు..!

బిహార్ను వీడని ముంపు కష్టాలు..!

పాట్నా: బిహార్​ను ముంపు కష్టాలు ఇంకా వీడలేదు. నదుల్లో నీటి మట్టాలు తగ్గుతున్నా.. వరదల వల్ల రాష్ట్రంలోని 48.35 లక్షల మందికి పైగా జనం ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు తెలిపారు. 15 జిల్లాల్లో 87 బ్లాకులు, 575 గ్రామ పంచాయతీల పరిధిలో ముంపు ప్రభావం వల్ల జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పాట్నా, భోజ్‌‌‌‌‌‌‌‌పూర్, సరన్, వైశాలి, భాగల్‌‌‌‌‌‌‌‌పూర్, బెగుసరాయ్, అరారియా జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. 

కోసి, బుర్హి గండక్, గంగా, పున్‌‌‌‌‌‌‌‌పున్, బాగమతి, ఘఘ్రా నదులు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ముప్పు కొనసాగుతున్నది. ఈ నెలలో 108.8 మి.మి. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. వరద బాధితుల కోసం 1,251 కమ్యూనిటీ కిచెన్లు, 13 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా దాదాపు 12,260 మందికి ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నారు.