లక్ష్యాల మేరకు ఓబీ, బొగ్గు ఉత్పత్తి సాధించాలి

లక్ష్యాల మేరకు ఓబీ, బొగ్గు ఉత్పత్తి సాధించాలి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఓవర్‌‌‌‌‌‌‌‌బర్డెన్‌‌‌‌‌‌‌‌ (ఓబీ), బొగ్గు ఉత్పత్తి సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సింగరేణి కాలరీస్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ కొప్పుల వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీ ప్రాజెక్టును ఆయన సందర్శించి ఓబీ పనులను పరిశీలించారు. 

అనంతరం ఏరియా అధికారులతో ఓబీ, బొగ్గు తవ్వకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఓబీ పనుల్లో నిర్లక్ష్యం లేకుండా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. ఆయన వెంట ఏరియా జీఎం వెంకటరమణతో పాటు అధికారులు పాల్గొన్నారు.