ఖమ్మం టౌన్, వెలుగు: తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) సభ్యత్వం తీసుకోవడం ద్వారా తమ జనాభాను కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ అన్నారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మున్నూరు కాపుల జనాభా తగ్గినట్లు చూపించడం వల్ల రాజకీయంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వెనుకబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సంఘం వెబ్‌సైట్ ద్వారా సభ్యత్వం తీసుకోవాలని కోరారు. మున్నూరు కాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, వెంటనే రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టి రంగారావు, నాయకులు రాపర్తి శరత్, మాటేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
