తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని యూనిటీ వాకర్స్ సొసైటీ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మైదం దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా గుగులోతు రెడ్యా, ట్రెజరర్ గా సీహెచ్.స్వామి, వైస్ ప్రెసిడెంట్ గా ఓంప్రకాశ్, జాయింట్ సెక్రటరీగా నాగరాజు, మీడియా కన్వీనర్ గా ప్రకాశ్, గౌరవ అధ్యక్షుడిగా చీకటి శ్రీనివాస్, ప్రధాన సలహాదారులుగా కొత్తగట్టు కృష్ణ, సలుగు నాగన్న, గుర్రం వెంకన్నను ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు.
