ఓరుగల్లు కోటను సందర్శించిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–2 ట్రైనీ ఆఫీసర్లు

ఓరుగల్లు కోటను సందర్శించిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–2 ట్రైనీ ఆఫీసర్లు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్‌‌‌‌‌‌‌‌ కోటను గ్రూప్‌‌‌‌‌‌‌‌-2 ట్రైనీ ఆఫీసర్లు ఆదివారం సందర్శించారు. కోటలోని వారసత్వ సంపద, శిల్పకళా వైభవాన్ని వీక్షించి కొనియాడారు. హైదరాబాద్​లోని మరిచెన్నారెడ్డి ఇనిస్టిట్యూట్​ శిక్షణ పొందుతున్న ఆఫీసర్లు కోటను సందర్శించగా, గైడ్‌‌‌‌‌‌‌‌ రవి యాదవ్‌‌‌‌‌‌‌‌ కోట నిర్మాణం, శిలాతోరణాల ప్రత్యేకత, కాకతీయుల శిల్పకళా వైభవాన్ని వివరించారు. 

స్వయంభు ఆలయం, ఖుష్‌‌‌‌‌‌‌‌మహల్‌‌‌‌‌‌‌‌, ఏకశిల కొండ, శృంగారపు బావి, అక్కాచెల్లెల బావి తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం భద్రకాళి, వేయి స్తంభాల ఆలయాలను కూడా సందర్శించారు.