భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరులకు ఆదివారం ఆంతరంగికంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. సుప్రభాత సేవ, బాలబోగం అనంతరం పాలు, నెయ్యి, పెరుగు, పంచదార, తేనెతో అభిషేకం చేసి విశేష హారతులు సమర్పించారు.
అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. మిథిలా ప్రాంగణంలో సీతారాముల నిత్య కల్యాణం నిర్వహించగా, భక్తులు కంకణాలు ధరించి పాల్గొన్నారు. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు.
