కర్ణాటక సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న బయోపిక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అమ్మ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రను రష్మిక మందన్న పోషించనున్నారు. ఈ పాత్ర కోసం రష్మిక ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా చేసినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.
భారతరత్న, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకుని.. రేపు సెప్టెంబర్ 16న చెన్నైలో ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక ఈ బయోపిక్‌కు మరో క్రేజీ కాంబినేషన్ కూడా కుదిరింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ నిర్మించనుంది.
‘MS – A Legacy On Screen’: గీతా ఆర్ట్స్
‘MS – A Legacy On Screen’ పేరుతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ తెలిపింది. సంగీత సరస్వతిగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి వారసత్వాన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.
‘A Legacy begins with an unforgettable celebration’ అంటూ గీతా ఆర్ట్స్ చేసిన ఈ పోస్టుతో ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
A LEGACY begins with an unforgettable celebration 🎶✨
— Geetha Arts (@GeethaArts) September 15, 2026
Witness the grand launch of #MS - A Legacy On Screen, celebrating Bharat Ratna #MSSubbulakshmi Amma's 110th Birth Anniversary with Ulaganayagan @ikamalhaasan garu as Chief Guest ❤️❤️
Starring @iamRashmika
Directed by… pic.twitter.com/1ebZtkDTrU
అయితే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్ర కోసం మొదట సాయి పల్లవి, రుక్మిణీ వసంత్, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. చివరికి రష్మికను మేకర్స్ ఫైనల్ చేశారు. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తి కావడంతో.. ఆమె ఈ పాత్రలో ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఒక గొప్ప సంగీత విద్వాంసురాలి జీవితాన్ని తెరపైకి తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు.. రష్మిక, గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్ కాంబినేషన్ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.
Some dreams deserve nothing less than a grand beginning ❤️
— Bunny Vas (@TheBunnyVas) September 15, 2026
Proud and emotional to present #MS – A Legacy On Screen, our most ambitious tribute to the timeless legacy of Bharat Ratna #MSSubbulakshmi Amma on her 110th Birth Anniversary 🎶🙏
Ulaganayagan @ikamalhaasan garu gracing… pic.twitter.com/gB6rbEx62v
