Comrade Kalyan: కామెడీతో కేక పెట్టించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్.. ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

Comrade Kalyan: కామెడీతో కేక పెట్టించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్.. ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 9న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.

‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, అల్లరి మేనరిజమ్స్ వేరే లెవల్లో ఉంది. హీరోయిన్ మహిమా నంబియార్ తన అందంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళ్యాణ్ (శ్రీవిష్ణు) తల్లిగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ తనదైన కామెడీతో అలరిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌ను పట్టుకోవడానికి పరిగెత్తే పోలీస్ ఆఫీసర్‌గా షైన్ టామ్ చాకో నెగెటివ్ అండ్ ఫన్నీ షేడ్స్‌లో కనిపించాడు. ఇక వెన్నెల కిషోర్, సత్యతో పాటు ఉపేంద్ర లిమాయే, బుల్లిరాజు (రేవంత్) వంటి కమెడియన్స్ తమదైన హాస్యంతో సినిమాపై అంచనాలు పెంచేశారు. 

అయితే ఈ ట్రైలర్‌కు ప్రత్యేకమైన రీతిలో ప్రమోషన్ లభించింది. ఏకంగా 9 మంది టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కలిసి ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసి సినిమాకు బూస్ట్ ఇచ్చారు. వారిలో ఆర్జీవీ, అనిల్ రావిపూడి, బాబీ, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్, బివీస్ రవి, నందిని రెడ్డి, రామ్ అబ్బరాజు ఉన్నారు. ఈ సందర్భంగా కోన వెంకట్ చేసిన పోస్ట్ కూడా ఆసక్తికరంగా మారింది. “నా ఆత్మీయులు.. నా బలం.. నా వాళ్లు” అంటూ ఆయన టాప్ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ట్రైలర్ కూడా ఆద్యంతం కామెడీ, వినోదంతో నిండిపోయి నవ్వులు పూయిస్తుండటంతో.. థియేటర్లలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరి శ్రీవిష్ణు ఈసారి ‘కామ్రేడ్ కళ్యాణ్’గా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

ALSO READ : ఓటీటీలోకి వచ్చేసిన 'స్పైడర్-మేన్: బ్రాండ్ న్యూ డే'..