చైనీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Oppo A7 Pro పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. భారీ 8,000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర భారత కరెన్సీలో సుమారు రూ.31,000.
Oppo A7 Pro ధర, కలర్ ఆప్షన్లు
Oppo A7 Pro రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర భారత కరెన్సీలో సుమారు రూ.31,000.
అదే 8GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన హైఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.35,000
కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. Desert Brown, Every Step Blossoms (Light Pink), Riding the Waves (Blue) రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. చైనాలో ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 11 నుంచి అధికారిక విక్రయాలు మొదలయ్యాయి. అయితే భారత మార్కెట్లో Oppo A7 Pro ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
120Hz డిస్‌ప్లే
Oppo A7 Proలో 6.57 అంగుళాల Full HD+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. దీంతో స్క్రోలింగ్, యానిమేషన్లు, గేమింగ్ సమయంలో డిస్‌ప్లే మరింత స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది.ఇక 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కూడా ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సాధారణ వినియోగంలో స్క్రీన్ బ్రైట్‌నెస్ 800 నిట్స్ వరకు ఉంటుంది. అవసరమైన సమయంలో గరిష్ఠంగా 1,400 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
పెర్ఫార్మెన్స్ కోసం Oppo A7 Proలో MediaTek Dimensity 6360 MAX చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో గరిష్ఠంగా 8GB LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ అందుబాటులో ఉంది. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP69K రేటింగ్ ఇచ్చారు. దీంతో రోజువారీ వినియోగంలో ఫోన్‌కు అదనపు రక్షణ లభించనుంది.
50MP కెమెరా
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. Oppo A7 Pro వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాను అందించారు. ఈ కెమెరాకు f/1.9 అపెర్చర్, ఆటోఫోకస్, 25mm ఫోకల్ లెంగ్త్ ఉన్నాయి.ఈ కెమెరాతో డిజిటల్‌గా 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో f/2.1 అపెర్చర్‌తో 8MP కెమెరాను అందించారు.
8,000mAh భారీ బ్యాటరీ
Oppo A7 Proలో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లలో బ్యాటరీ కూడా ఒకటి. ఈ ఫోన్‌లో ఏకంగా 8,000mAh బ్యాటరీని అందించారు. దీనికి 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
భారీ బ్యాటరీ కారణంగా సాధారణ వినియోగంలో ఎక్కువ బ్యాకప్‌ను అందించే అవకాశం ఉంది. తరచూ ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువసేపు ఉపయోగించాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉండొచ్చు.
5Gతో పాటు అనేక కనెక్టివిటీ ఫీచర్లు
కనెక్టివిటీ పరంగా Oppo A7 Proలో 5G, Wi-Fi 5, Bluetooth 5.4, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే BeiDou, GPS, GLONASS, Galileo, QZSS నావిగేషన్ సిస్టమ్స్‌కు సపోర్ట్ ఉంది. ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం USB Type-C పోర్ట్‌ను అందించారు.సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు.
Oppo A7 Pro స్పెసిఫికేషన్లు
- డిస్‌ప్లే: 6.57 అంగుళాల Full HD+, 120Hz
- టచ్ శాంప్లింగ్ రేట్: 240Hz
- ప్రాసెసర్: MediaTek Dimensity 6360 MAX
- RAM: 6GB / 8GB LPDDR4X
- స్టోరేజ్: 256GB UFS 2.2
- వెనుక కెమెరా: 50MP, f/1.9, ఆటోఫోకస్
- ముందు కెమెరా: 8MP, f/2.1
- బ్యాటరీ: 8,000mAh
- ఛార్జింగ్: 45W SuperVOOC
- ప్రొటెక్షన్: IP69K
- కనెక్టివిటీ: 5G, Wi-Fi 5, Bluetooth 5.4, NFC
- పోర్ట్: USB Type-C
- ఫింగర్‌ప్రింట్: ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ సెన్సార్
మొత్తంగా చూస్తే.. భారీ 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, IP69K రేటింగ్ వంటి ఫీచర్లతో Oppo A7 Pro మిడ్-రేంజ్ విభాగంలో ఆసక్తికరమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది. అయితే భారత మార్కెట్లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుంది, ఇక్కడ ధర ఎంత ఉంటుంది అనే విషయాలపై Oppo నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
