రాకింగ్ స్టార్ యష్ నుంచి 'కేజీఎఫ్ 2' తర్వాత వచ్చిన యాక్షన్ చిత్రం 'టాక్సిక్' . గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే భారీ హైప్‌కు తగ్గట్టుగా బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగించలేకపోయింది. భారీ తారాగణం, రవి బస్రూర్ సంగీతం, కోట్లలో పెట్టిన బడ్జెట్... ఇవేవీ ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను డిజాస్టర్ నుంచి కాపాడలేకపోయాయి.
థియేటర్లలో చతికిలబడటంతో.. అందరి దృష్టి ఇప్పుడు ఓటీటీ (OTT) స్ట్రీమింగ్ పైనే పడింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ZEE5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీపై మేకర్స్ , OTT సంస్థ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు
ఇక ఈ సినిమా OTT డీల్ విషయంలోనే షాక్ విషయాలు బయటకు వస్తున్నాయి.. రిలీజ్‌కు ముందు ప్రముఖ OTT సంస్థ నుంచి దాదాపు రూ.150 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ.. మేకర్స్ రూ.200 కోట్లకు పైగా డీల్ కోసం ఎదురుచూశారనే ప్రచారం జరిగింది. కానీ థియేట్రికల్ రిజల్ట్ అంచనాలను అందుకోకపోవడంతో డిజిటల్ హక్కుల విలువ భారీగా పడిపోయిందని టాక్ వినిపిస్తోంది. కొన్ని నివేదికల్లో ఈ ఆఫర్ ఏకంగా రూ.30 కోట్ల స్థాయికి పడిపోయిందని పేర్కొంటున్నాయి
అంతేకాదు.. OTT కోసం 'టాక్సిక్'కు కొత్త కట్ సిద్ధం చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంటే థియేటర్లలో చూసిన సినిమాతో పోలిస్తే డిజిటల్ వెర్షన్‌లో మార్పులు ఉండే అవకాశం ఉందన్నమాట. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న 'టాక్సిక్'కు OTTలో మాత్రం మరో ఛాన్స్ దక్కనుంది. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి క్రేజీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ థియేటర్లలో బోల్తా కొట్టిన ఈ 'టాక్సిక్', మరి డిజిటల్ స్క్రీన్లపై ఏ మేర మ్యాజిక్ చేస్తుందో చూడాలి..
