విద్యార్థులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన

విద్యార్థులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన

కూసుమంచి, వెలుగు : విద్యార్థుల్లో వ్యవసాయం, నీటి సంరక్షణపై ఆసక్తి పెంపొందించడంతో పాటు ఆధునిక సాగు పద్ధతులను ప్రత్యక్షంగా పరిచయం చేయాలనే లక్ష్యంతో ఖమ్మం వివేకానంద ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ (వీఐహెచ్‌‌‌‌‌‌‌‌ఈ) ఆధ్వర్యంలో పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో ‘ప్రాజెక్ట్ పాణి’ పేరుతో గ్రీన్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్​ఓక్రిడ్జ్ స్కూల్ కు చెందిన 12వ తరగతి విద్యార్థి దక్ష్ సూదిని ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు ఆయన తల్లి దీప్తి ఆర్థిక సహకారం అందించారు. 

వీఐహెచ్‌‌‌‌‌‌‌‌ఈ వ్యవస్థాపకుల చొరవతో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ప్రాజెక్ట్ ద్వారా తక్కువ నీటితో సాగు, పరిమిత స్థలంలో అధిక దిగుబడి, సేంద్రియ వ్యవసాయం, మొక్కల పెంపకం, నీటి పొదుపు వంటి అంశాలపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించనున్నారు. గ్రీన్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో పండించే కూరగాయలను విద్యార్థుల అవసరాలకు వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు. కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ వెంకట రమణ, వీఐహెచ్‌‌‌‌‌‌‌‌ఈ కార్యదర్శి గన్నవరపు చంద్రశేఖర్, కమిటీ సభ్యులు జయంత్ పటేల్ పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.