జైనూర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ స్కూళ్లకు చెందిన బాయ్స్ హాస్టల్స్ మూతపడ్డాయి. పోచంనొద్ది, మార్లవాయి, పానపట్టర్‌లోని బాయ్స్ స్టూడెంట్స్ లేకపోవడంతో హాస్టల్స్ వెలవెలబోయాయి. కనీసం పదో తరగతి స్టూడెంట్స్ కూడా హాస్టల్స్‌లో కనిపించలేదు. ఈ నెల 9న తేదీన స్టూడెంట్స్ ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం మండలంలోని గర్ల్స్ హాస్టల్స్‌లో వందశాతం హాజరు నమోదైంది. పొలాల పండగ నేపథ్యంలో స్టూడెంట్స్ పేరెంట్స్ ఒత్తిడి చేయడంతో బాయ్స్ హాస్టల్స్ హెచ్ఎంలు, వార్డెన్లు అనధికారికంగా సెలవులు ప్రకటించినట్లు జైనూర్ ఏటీడీవో శ్రీనివాస్ తెలిపారు. బాయ్స్ హాస్టల్స్‌కు అధికారికంగా సెలవులు ప్రకటించారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
