గోదావరిఖని: తెలంగాణ ప్లాంట్ స్టేజ్2 పనులు ప్రారంభం

గోదావరిఖని: తెలంగాణ ప్లాంట్ స్టేజ్2 పనులు ప్రారంభం
  •     లెవలింగ్ పనులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత భూమి పూజ

గోదావరిఖని, వెలుగు : తెలంగాణ ప్లాంట్​స్టేజ్​2 నిర్మాణ పనులను ఎన్టీపీసీ విద్యుత్​సంస్థ శనివారం ప్రారంభించింది. మెయిన్​ప్లాంట్​సైట్​లెవలింగ్​పనులకు రామగుండం, తెలంగాణ ప్లాంట్​హెడ్, ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్​చందన్​కుమార్ సమంత భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ, బీహెచ్ ఈఎల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్లాంట్ స్టేజ్​2లో ఒక్కో యూనిట్ 800 మెగావాట్లతో మూడు యూనిట్లకు సంబంధించిన బాయిలర్, టర్బైన్, జనరేటర్ (బీటీజీ) ఏర్పాటు పనులను బీహెచ్ఈఎల్​దక్కించుకుంది. 

మొత్తం రూ.13,500 కోట్లతో చేపడుతున్న ఈ పనులను 300 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్​పునర్విభజన చట్టం 2014 ప్రకారం రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ ప్లాంట్​స్టేజ్ 1 కింద ఇప్పటికే 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లలో రెండేండ్లుగా విద్యుత్​ఉత్పత్తి జరుగుతోంది. రామగుండం ప్లాంట్​లో ఇప్పటికే ఏడు యూనిట్ల ద్వారా 2,600 మెగావాట్ల విద్యుత్​, తెలంగాణ స్టేజ్​1 ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్, రిజర్వాయర్​పై 100 మెగావాట్ల ప్లోటింగ్​సోలార్​విద్యుత్, సర్ఫేస్ పై 10 మెగావాట్ల సోలార్​విద్యుత్​కలిపి మొత్తం 4,300 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణ ప్లాంట్ స్టేజ్​2 నిర్మాణం సైతం పూర్తయితే మరో 2,400 మెగావాట్ల విద్యుత్ కలిపి రామగుండం ఎన్టీపీసీ ద్వారా మొత్తం 6,710 మెగావాట్ల విద్యుత్​ఉత్పత్తి జరగనుంది. ఈ మొత్తం ఉత్పత్తి ప్రారంభం అయితే దేశంలోనే అత్యధిక విద్యుత్​ఉత్పత్తి చేసే ప్లాంట్​గా రామగుండం ఎన్ టీపీసీ నిలవనుంది.