వారఫలాలు(సెప్టెంబర్1319): ఈ వారం ప్రారంభంలోనే వినాయకచవితి వచ్చింది. కన్యారాశిలో కి సూర్యుడు, కుజుడు60 డిగ్రీల కోణంలో సంచారం చేయనున్నారు. ఈ రెండు గ్రహాల మధ్య దూరం అతి తక్కువుగా ఉండటంతో.. లాభ దృష్టి యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. జ్యోతిష్య నిపుణులు అందించిన సమాచారం ప్రకార ఈ వారంలో గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వారు ఈ వారం తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమమవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృషభరాశి :ఈ రాశికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా దాదాపు అన్ని రంగాల వారు శుభఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. సోదరుల మీద విజయాలు సాధిస్తారు. సమాజంలో పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. విద్యా ర్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. రావలసిన ధనం చేతికి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
మిథునరాశి : ఈ రాశి వారికి ఈ వారమంతా మిశ్రమ ఫలితాలుంటాయి.ఆదాయానికి మించిన ఖర్చులు. కార్యక్రమాలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. . వృత్తి, వ్యాపారాల్లోనే కాక, వ్యక్తిగత జీవితంలో కూడా ఏమాత్రం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటకరాశి :ఈ రాశి వారికి ఈ వారం అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. కొత్త పెట్టుబడుల విషయంలోఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు. విద్యార్థుల విషయంలో కేరీర్ పరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో మిశ్రమఫలితాలుంటాయి. వారం మధ్యలో నుంచి కొంత ఊరట లభిస్తుంది. స్థిర ఆస్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. మొండిబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారు అంచనాలు , ఊహలు నిజం చేసుకుంటారు.
కన్య రాశి :ఈ రాశి వారికి ఈ వారంలో కుటుంబ మిశ్రమ వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు ఖర్చులు పెరుగుతాయి. ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి.. ప్రేమ వ్యవహారాలు పరవా లేదనిపిస్తాయి.
తులా రాశి : ఈ రాశి వారికి ఈ వారం ధన-సంపత్తులు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్తలు మీ ఇంటి గుమ్మం త్రొక్కుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించని లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభించడంతో ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఆస్తిపాస్తులు, నూతన వాహనాలు లేదా భూములు కొనుగోలు చేసేందుకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఉద్యోగ వేటలో ఉన్న యువతకు త్వరలోనే మంచి కంపెనీల నుంచి పిలుపు వస్తుంది.
వృశ్చికరాశి : ఈ వారం ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వీరు చేపట్టిన వ్యవహారాలలో మొదట్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఖర్చులు పెరగడంతో రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ధనుస్సురాశి : ఈ వారం ఈ రాశి వారు కెరీర్ గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.ఆర్థిక వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. వృత్తి .. ఉద్యోగాల్లో కీలక పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేందు అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు. ఇంటాబయట మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రతి విషయాన్ని ఓర్పు.. సహనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
మకరరాశి : ఈ రాశివారికి ఈ వారం కొద్దిపాటి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి డబ్బు ఖర్చయిపోతుంది. ఇతరు లకు సహాయం చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకొండి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వ్యాపారపరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా సంప్రదింపులు జరపండి. అనవసరంగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈవారంలో ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ఉద్యోగ, వ్యాపారంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలసిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం.. గృహనిర్మాణం చేపట్టే అవకాకాశాలున్నాయి.
మీనరాశి: ఈ వారం ఈ రాశి వారు శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. పెండింగ్ పనుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. వ్యాపారాల్లో అప్రయత్న ధన లాభం ఉంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
