OTT New Movies: వినాయక చవితి ముందు ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాల లిస్ట్ ఇదే!

OTT New Movies: వినాయక చవితి ముందు ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాల లిస్ట్ ఇదే!

వినాయక చవితి పండుగ సందడి మొదలవుతున్న వేళ.. వీకెండ్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 11, శుక్రవారం నుంచి పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా తెలుగు, మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ ఆసక్తికరమైన కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ వినాయక చవితి వీకెండ్‌లో ఇంట్లోనే సినిమాలు, సిరీస్‌లతో ఎంజాయ్ చేయాలనుకునే వారికి అందుబాటులోకి వచ్చిన ముఖ్యమైన ఓటీటీ రిలీజులు, వాటి ప్రత్యేకతలు ఇవే..

విశ్వనాథ్ అండ్ సన్స్

తమిళ స్టార్ హీరో సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నిన్నటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, ప్రేమతో పాటు సరోగసీ అంశాన్ని టచ్ చేస్తుంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి స్పందన అందుకుంది. వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి చూడాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

స్ట్రీమింగ్: Netflix
భాష: తమిళం (తెలుగు, హిందీ తదితర ఆడియో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి)

వరవు – ZEE5

మలయాళ స్టార్ జోజు జార్జ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ‘వరవు’ కూడా సెప్టెంబర్ 11 నుంచి ZEE5లోకి వచ్చింది. ఏకే సాజన్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమా టీ తోటల నేపథ్యంలోని అధికారం, పగలు, ప్రతీకారాల చుట్టూ సాగుతుంది. థియేటర్లలో జూలైలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. జోజు జార్జ్ మాస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

స్ట్రీమింగ్: ZEE5
భాష: మలయాళం
జానర్: యాక్షన్ డ్రామా / రివెంజ్

పంచనామా 

తెలుగులో క్రైమ్ థ్రిల్లర్‌ను ఇష్టపడే వారికి ‘పంచనామా’ ఆసక్తికరమైన ఆప్షన్. భారత్ శ్రీనివాసన్, ఉదయ భాను తదితరులు నటించిన ఈ ఆరు ఎపిసోడ్ల ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను మోహన్ శ్రీవత్స తెరకెక్కించారు. ముగ్గురు స్నేహితుల హత్య, పోలీసులకు దొరికిన రెండు చేతులు.. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజాన్ని పోలీసులు ఎలా బయటపెట్టారన్నదే కథలో ఆసక్తికరమైన అంశం. సెప్టెంబర్ 11 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.

ALSO READ : మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి బరిలో 'విశ్వంభర'?

స్ట్రీమింగ్: ZEE5
భాష: తెలుగు
జానర్: క్రైమ్ / ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఎపిసోడ్స్: 6

ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్

మలయాళ సినీ పరిశ్రమను నేపథ్యంగా చేసుకుని తెరకెక్కిన కామెడీ డ్రామా ‘ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్’ కూడా నిన్నే JioHotstarలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. సినీ హీరో కావాలనే కలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే యువకుడి ప్రయాణం, అతడి ప్రయత్నాలు, ఎదురయ్యే పరిస్థితులను వినోదాత్మకంగా చూపించే సిరీస్ ఇది. మలయాళ సినిమా ఇండస్ట్రీపై కామెడీ టచ్‌తో రూపొందడం దీని ప్రత్యేకత.

స్ట్రీమింగ్: JioHotstar
భాష: మలయాళం
జానర్: కామెడీ / డ్రామా

మహారాజా హాస్టల్

మలయాళంలో ‘మహారాజా హాస్టల్’ అనే హారర్ కామెడీ కూడా సెప్టెంబర్ 11న Prime Videoలోకి వచ్చింది. కాలేజీ విద్యార్థులు హాస్టల్‌లోకి వెళ్లిన తర్వాత ఎదుర్కొనే వింత అనుభవాలు, భయానక పరిస్థితులను వినోదాత్మకంగా చూపించే చిత్రమిది. హారర్‌తో పాటు కామెడీని ఇష్టపడేవారికి ఇది వీకెండ్ ఆప్షన్.

ALSO READ : చేతనైతే ‘స్పిరిట్’ను అటాక్ చేయండి..

OTT: ఆహా, Prime Video
భాష: మలయాళం
జానర్: హారర్ కామెడీ

అచ్యుత అవతారం

మరో మలయాళ చిత్రం ‘అచ్యుత అవతారం’ కూడా అదే రోజు Prime Videoలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. సైబర్ మోసానికి గురైన ఓ మహిళ.. ఆ మోసానికి పాల్పడిన వారిపై పోరాటం మొదలుపెట్టే కథ ఇది. క్రైమ్, సైబర్ స్కామ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ప్రస్తుతం డిజిటల్‌లో అందుబాటులో ఉంది.

OTT: Prime Video
భాష: మలయాళం
జానర్: సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఘమాసాన్ 

హిందీలో వచ్చిన ‘ఘమాసాన్’ ఈ వారం OTTలోని ముఖ్యమైన రిలీజ్‌లలో ఒకటి. అర్షద్ వార్సీ ఓ భయంకరమైన దొంగ పాత్రలో కనిపించగా.. ప్రతీక్ గాంధీ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. బుందేల్‌ఖండ్ నేపథ్యంలోని పోలీస్-దొంగ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్, రాజకీయాలు, అవినీతి ఈ కథలో కీలకంగా ఉంటాయి.

OTT: ZEE5
భాష: హిందీ
జానర్: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్

ది రివల్యూషనరీస్

భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన కథలను ఇష్టపడేవారికి ‘ది రివల్యూషనరీస్’ ఆసక్తికరమైన ఎంపిక. భువన్ బామ్, రోహిత్ సరాఫ్, ప్రతిభ రాంటా తదితరులు నటించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా నలుగురు యువ విప్లవకారుల కథను చూపిస్తుంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT: Prime Video
భాష: హిందీ
జానర్: పీరియడ్ యాక్షన్ డ్రామా

అలీ బాబా ఔర్ 40 భూత్ 

హారర్, కామెడీ కలయికలో తెరకెక్కిన ‘అలీ బాబా ఔర్ 40 భూత్’ కూడా ఈ వీకెండ్‌లో అందుబాటులోకి వచ్చింది. పేరుకు తగ్గట్టుగానే 40 దెయ్యాల చుట్టూ తిరిగే వినోదాత్మక కథతో ఈ సిరీస్ సాగుతుంది. హారర్‌ను కామెడీతో కలిపి చూడాలనుకునేవారికి ఇది మరో ఆప్షన్.

OTT: JioHotstar
భాష: హిందీ
జానర్: హారర్ కామెడీ

మొత్తానికి..

ఈ వీకెండ్ OTTలో తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కంటెంట్‌కు కొదవ లేదు. ఫ్యామిలీ డ్రామా కోసం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, యాక్షన్ కోసం ‘వరవు’, ‘విశాల్ మకుటం’, థ్రిల్లర్ కోసం ‘పంచనామా’, ‘ఘమాసాన్’, హారర్ కామెడీ కోసం ‘మహారాజా హాస్టల్’, ‘అలీ బాబా ఔర్ 40 భూత్’.. ఇలా ప్రతి జానర్‌కు ఓ ఆప్షన్ ఉండటంతో OTT ఆడియన్స్ కు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.