Chiranjeevi: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి బరిలో 'విశ్వంభర'?

Chiranjeevi: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి బరిలో 'విశ్వంభర'?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 'విశ్వంభర'. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి టాలీవుడ్ ను ఊపేస్తోంది. హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నాణ్యతతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను సంక్రాంతి 2027 బరిలో దింపేందుకు మేకర్స్ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పడు ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సంక్రాంతే పర్ఫెక్ట్ టార్గెట్..

ముఖ్యంగా జనవరి 12, 2027 తేదీని పరిశీలిస్తున్నారనే ప్రచారం మెగా ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా ఉత్సాహాన్ని పెంచుతోంది. షూటింగ్ ఆఖరి షెడ్యూల్ పనులు వేగంగా పూర్తవుతుండటంతో పాటు, రాత్రింబవళ్లు నడుస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా తుది దశకు చేరుకుంది. స్టాలిన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, అందాల భామ త్రిష మళ్లీ జోడీ కడుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకుతోంది.

దర్శకుడి లైఫ్‌టైమ్ డ్రీమ్..

'బింబిసార'తో బ్లాక్‌బస్టర్ కొట్టిన విజనరీ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ, తన ఆరాధ్య దైవమైన చిరంజీవిని సరికొత్త మాస్ అండ్ డివైన్ అవతార్‌లో చూపిస్తూ ఈ విజువల్ ఫీస్ట్‌ను రూపుదిద్దారు. అటు ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం దిగ్గజ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఊహించని రీతిలో భారీ పోటీ నెలకొంది. ఈ క్రేజీ డిజిటల్ బిజినెస్ డీల్ టాలీవుడ్‌లోనే అత్యధిక ఆల్-టైమ్ రికార్డు ధరకు క్లోజ్ కానున్నట్లు తెలుస్తోంది.

'కాకా 'వాయిదా?

అయితే అసలు ట్విస్ట్ సంక్రాంతి రేసులోనే ఉంది. చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'కాకా'ఇప్పటికే జనవరి 13, 2027న విడుదల కానున్నట్లు ప్రకటించారు. అలాంటప్పుడు కేవలం ఒక్కరోజు తేడాతో 'విశ్వంభర'ను తీసుకురావడం సాధ్యమా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ 'విశ్వంభర'కు సంక్రాంతి తేదీ ఖరారైతే, మెగాస్టార్ నుంచి బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో పండుగ మరింత మెగా ఫీస్ట్‌గా మారడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ALSO READ : చేతనైతే ‘స్పిరిట్’ను అటాక్ చేయండి.. చూసుకుందాం

 మెగా పోటీ తప్పదా?..

సంక్రాంతి రేసులో ఇతర చిత్రాల ప్రచారం నడుస్తున్న వేళ, 'విశ్వంభర' తుఫాన్ ఎంట్రీతో పండుగ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పండుగ షెడ్యూల్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా బాక్సాఫీస్ వద్ద మెగా పోటీ తప్పదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రపంచస్థాయి విజువల్ ఫీస్ట్‌గా రాబోతున్న ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్, థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.  అయితే ప్రస్తుతం జనవరి 12 తేదీ అధికారికంగా ఖరారు కాలేదు. తుది వీఎఫ్‌ఎక్స్ పనులు, ఓటీటీ ఒప్పందం, ఇతర చిత్రాల విడుదల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చిన తర్వాతే మేకర్స్ ఫైనల్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.