సినిమా విడుదలైన తర్వాత కథ, కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై విమర్శలు రావడం కామనే. అయితే ఒక్కోసారి ఆ విమర్శలు హద్దులు దాటుతున్నాయంటూ మేకర్స్, ప్రొడ్యూసర్స్ ఎదురుదాడికి దిగుతుంటారు. తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాను నిర్మించిన ‘రోమాంచకం’ సినిమాపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన సినీ క్రిటిక్స్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల విడుదలైన ‘రోమాంచకం’కు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని, విమర్శకుల రివ్యూలు కూడా సినిమాపై ప్రభావం చూపించాయని ప్రణయ్ వంగా అభిప్రాయపడ్డారు. సినిమా తీయడం ఎంత కష్టమో ప్రొడక్షన్‌లోకి వస్తేనే తెలుస్తుందని చెబుతూ.. చిన్న సినిమాపై సులభంగా విమర్శలు చేయడం ఎందుకంటూ ప్రశ్నించారు.
చేతనైతే ‘స్పిరిట్’ను అటాక్ చేయండి..
“చేతనైతే ‘స్పిరిట్’ను అటాక్ చేయండి.. సినిమా విడుదలయ్యాక చూద్దాం” అంటూ ఆయన చేసిన సవాల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్న సినిమాను టార్గెట్ చేయడం సులభమని, కానీ ‘స్పిరిట్’ లాంటి భారీ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను వంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
#Spirit Vasthundi ga, chusukundam anta 🔥
— VANGA FILMS (@Vanga_Films) September 11, 2026
Vanga & Pranay are bringing absolute chaos next month, loaded with insane surprises!
Critics and haters, start preparing your excuses now—just wait for Vanga to step into the ring! 💥@imvangasandeep pic.twitter.com/npClQKbbJl
‘స్పిరిట్’పై ఇంత హైప్ ఎందుకు?
ఇక ‘స్పిరిట్’ విషయానికి వస్తే.. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మరోవైపు ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగా. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా కావడంతో ‘స్పిరిట్’పై నేషనల్ వైడ్‌గా భారీ బజ్ ఉంది.
సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన మాస్, ఇంటెన్స్ టేకింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రభాస్ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆ పాత్ర సాధారణ కమర్షియల్ పోలీస్ క్యారెక్టర్ కాదనే అంచనాలు మొదటి నుంచే ఉన్నాయి. ఒకవైపు నిజాయితీ, మరోవైపు పరిస్థితులతో పోరాటం.. క్రైమ్, యాక్షన్, ఎమోషన్ కలిసిన డార్క్ టోన్‌లో ప్రభాస్ పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం.
ప్రభాస్‌ను మరో యాంగిల్‌లో చూపించనున్న వంగా?
‘బాహుబలి’, ‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ చిత్రాలతో ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ వేరు. అలాంటి స్టార్‌ను సందీప్ రెడ్డి వంగా తన స్టైల్‌లో ఎలా ప్రెజెంట్ చేస్తాడనేది ‘స్పిరిట్’లో అసలు ఆసక్తి. సందీప్ సినిమాల్లో హీరో కేవలం హీరోగా కనిపించడు.. అతడి మైండ్‌సెట్, కోపం, బలహీనతలు, ఎమోషన్స్, గ్రే షేడ్స్ కూడా కథలో కీలకంగా మారుతాయి. అదే ఫార్ములాను ప్రభాస్ లాంటి భారీ ఇమేజ్ ఉన్న హీరోతో కలిపితే తెరపై ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందనేది ఆసక్తిని పెంచుతోంది. అందుకే ‘స్పిరిట్’పై అంచనాలు కేవలం ప్రభాస్ స్టార్‌డమ్ వల్లే కాదు.. సందీప్ రెడ్డి వంగా విజన్‌ను ప్రభాస్ ఎంతవరకు క్యారీ చేస్తాడనే అంశం కూడా ఈ సినిమాకు పెద్ద ఎట్రాక్షన్‌గా మారింది.
A సర్టిఫికెట్.. భారీ అంచనాలు
ఇక ‘స్పిరిట్’కు ఇప్పటికే A సర్టిఫికెట్ వస్తుందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. అంటే సినిమాలోని కంటెంట్ మరింత ఇంటెన్స్‌గా, అడల్ట్ టోన్‌లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా మార్చి 5, 2027న విడుదలకు షెడ్యూల్ అయింది. ప్రభాస్‌కు ఉన్న మాస్ ఇమేజ్, సందీప్ రెడ్డి వంగా గత చిత్రాల క్రేజ్, సినిమాపై ఉన్న భారీ అంచనాలు.. ఇవన్నీ కలిపి ‘స్పిరిట్’ను ఇండియన్ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా మార్చేశాయి.
#Spirit 🤙🏻 pic.twitter.com/1zy6CoGAFI
— Spirit (@InSpiritMode) August 25, 2026
ఇలాంటి సమయంలో ప్రణయ్ వంగా “స్పిరిట్‌ను టార్గెట్ చేయండి.. అప్పుడు చూద్దాం” అంటూ క్రిటిక్స్‌కు సవాల్ విసరడం మరింత హీట్ పెంచింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. ‘రోమాంచకం’పై విమర్శలకు ‘స్పిరిట్’తో సమాధానం ఇస్తామంటున్న వంగా బ్రదర్స్.. సినిమా విడుదలైన తర్వాత నిజంగానే క్రిటిక్స్‌కు షాక్ ఇస్తారా? దానికి సమాధానం తెలియాలంటే ‘స్పిరిట్’ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే!
You loved what existed before.
— Spirit (@InSpiritMode) December 31, 2025
Now fall in love with what you never knew existed….#SPIRIT FIRST POSTER 🔥#OneBadHabit #Prabhas@imvangasandeep @tripti_dimri23 pic.twitter.com/J1Svt3E8uY
