పాముపై ముంగిస దాడి.. నెత్తురు కక్కుకుంటూ చచ్చిపోయిన పాము.. వీడియో వైరల్

పాముపై ముంగిస దాడి.. నెత్తురు కక్కుకుంటూ చచ్చిపోయిన పాము.. వీడియో వైరల్

కొమురంభీం జిల్లా: పాముపై ముంగిస దాడి చేసింది. ఈ దాడిలో పాము తీవ్రంగా గాయపడింది. నెత్తురు కక్కుకుంటూ చచ్చిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలం నాగుల్వాయి గ్రామంలో నాగు పాముపై ముంగిస దాడి చేసింది. నాగు పాము మృతి చెందింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాగుల్వాయి గ్రామానికి చెందిన లెండుగురే సాంబయ్య ఇంటి దగ్గర ఈ నాగు పాము-ముంగిస కొట్లాట జరిగింది.

ముంగిస ఎదురు పడితే పాము తప్పించుకొని పారిపోయి ప్రాణం కాపాడుకోడానికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ముంగిసతో కొట్లాడేంత సాహసం పాములు చేయవు. ముంగిసను ఆహారంగా తినగలిగేంత పరిస్థితి పాముకు లేదు. అయితే.. ముంగిస మాత్రం పామును చంపి తినేయగలదు. వీటిది ఎప్పటి నుంచో జాతి వైరం. అందుకే.. ఎవరైనా బద్ధ శత్రువుల గురించి మాట్లాడే సమయంలో పాము-ముంగిసతో పోల్చుతుంటారు.

పాముకు, ముంగిసకు అస్సలు పడదు. ఒకటి మరొక దానిని విపరీతంగా ద్వేషిస్తాయి. అంతు చూసే దాకా వదలవు. పామైనా చావాలి లేదా ముంగిసైనా చావాలి. అంత పంతంగా కొట్లాడుకుంటాయి. ఒకటి గెలిస్తే మరొకటి చనిపోతుంది. కాకపోతే ముంగిస తన చిత్రవిచిత్రమైన కదలికలతో పాము కాటు నుంచి ముంగిస తప్పించుకొని చంపే ప్రయత్నం చేస్తుంది. పాము తన కాటుతో ముంగిసను చంపేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ పోరులో కొన్నిసార్లు ముంగిస, ఇంకొన్ని సార్లు పాము గెలుస్తుంటుంది. కానీ.. చాలా సందర్భాల్లో ముంగిసనే పైచేయి సాధిస్తుంటుంది.