సెప్టెంబర్ 16 న సీఐఐ ఎనర్జీ సమిట్ 

సెప్టెంబర్ 16 న సీఐఐ ఎనర్జీ సమిట్ 

హైదరాబాద్​, వెలుగు: కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) ఈ నెల 16–18 తేదీల్లో తమ 25వ    ఎనర్జీ సమిట్‌‌ను  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీసీలో నిర్వహించనుంది.  "ఇంధన సామర్థ్యం, పర్యావరణ అనుకూల టెక్నాలజీలు, విధానాల ద్వారా నెట్ జీరో ఆర్థిక వ్యవస్థకు మారడాన్ని వేగవంతం చేయడం" అనే ప్రధాన థీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ సదస్సు సాగనుంది. దేశవిదేశాల నుంచి 3,500 మందికి పైగా ప్రతినిధులు, 150 మంది ప్రముఖ వక్తలు హాజరుకానున్నారు. 

పవర్ ప్లాంట్, పేపర్ టెక్, క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ స్టార్టప్ రంగాలపై మూడు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తారు. 300కు పైగా సంస్థలకు జాతీయ ఇంధన నిర్వహణ అవార్డులను అందజేయనున్నారు. తక్కువ కార్బన్ టెక్నాలజీలను ప్రదర్శించే ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేస్తారని, 110కి పైగా ఎగ్జిబిషన్ స్టాళ్లు ఈ సదస్సుకు ప్రధాన ఆకర్షణ అని సీఐఐ తెలిపింది.