రాష్ట్రంలో భారీగా నర్సింగ్ ఆఫీసర్ కొలువులు .. అప్లై చేసుకోండి!

రాష్ట్రంలో భారీగా నర్సింగ్ ఆఫీసర్ కొలువులు .. అప్లై చేసుకోండి!

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 10న ప్రారంభం కాగా, అక్టోబర్ 3 వరకు కొనసాగనుంది.

పోస్టు పేరు: నర్సింగ్ ఆఫీసర్.

మొత్తం ఖాళీలు: 243 (అన్ రిజర్వ్డ్ 99, ఎస్సీ 36, ఎస్టీ 18, ఓబీసీ 66, ఈడబ్ల్యూఎస్ 24, పీడబ్ల్యూబీడీ 10). 

విద్యార్హత: అభ్యర్థులు నిర్దేశిత అర్హతల్లో ఏదో ఒక దానిని కలిగి ఉండాలి.

ఆప్షన్ ఏ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్, రెగ్యులర్ బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌‌లో నర్సు లేదా నర్సు మిడ్‌‌వైఫ్‌‌గా రిజిస్టర్ అయి ఉండాలి.

ఆప్షన్ బి: గుర్తింపు పొందిన బోర్డు లేదా కౌన్సిల్ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌‌వైఫరీ (జీఎన్ఎం) డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌‌లో నర్సు లేదా నర్సు మిడ్‌‌వైఫ్‌‌గా రిజిస్టర్ అయి ఉండాలి. అర్హత సాధించిన తర్వాత కనీసం 50 పడకల హాస్పిటల్​లో  ఏడాది పాటు పని చేసిన అనుభవం ఉండాలి.

వయసు ( 2026, అక్టోబర్ 3 నాటికి): 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: పీడబ్ల్యూబీడీలకు ఫీజు ఉండదు. ఎస్సీ, ఎస్టీలు రూ.800, జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్/ ఇతర అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 3.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), షార్ట్ లిస్టింగ్, అప్లికేషన్స్ స్క్రూట్నీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రూప్ 'బి' (నాన్ -–గెజిటెడ్) పోస్టు అయినందున ఇంటర్వ్యూ ఉండదు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  pgimer.edu.inను సందర్శించండి. 

రాత పరీక్ష

ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా జరుగుతుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. 

పీజీఐఎంఈఆర్ నర్సింగ్ ఆఫీసర్ పరీక్షలో అర్హత సాధించడానికి కేటగిరీల వారీగా కనీస మార్కులు నిర్ణయించారు. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 35 శాతం, దివ్యాంగుల అభ్యర్థులు తమ సంబంధిత కేటగిరీకి నిర్దేశించిన కనీస అర్హత మార్కులు సాధించాలి.