క్రేజీ ప్రాజెక్టులతో ధృవ్ విక్రమ్.. 

క్రేజీ ప్రాజెక్టులతో ధృవ్ విక్రమ్.. 

తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న తమిళ చిత్రంలో ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి జాకీ' అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. నో రీటేక్స్ అలౌడ్ అనేది క్యాప్షన్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ను స్టైలిష్ కామిక్ బుక్ విజువల్స్ రూపొందించడం..ఆకట్టుకుంది. ఇందులో ధృవ్ ఫుల్ మాస్, ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. 

నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు పెన్ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్వి స్టూడియోస్ బ్యానర్లపై ధృవ్ విక్రమ్ హీరోగా మరో హై ఇంటెన్స్ యాక్షన్ చిత్రం తెరకెక్కుతోంది. 

రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, డ్రామాగా రూపొందనుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తికాగా, అక్టోబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది.