25 ఏళ్లలో అమెరికాను దాటేయనున్న ఇండియా.. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది: ఆర్థిక వేత్త జెఫ్రీ సాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

25 ఏళ్లలో అమెరికాను దాటేయనున్న ఇండియా.. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది: ఆర్థిక వేత్త జెఫ్రీ సాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • చైనా మొదటి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుటుంది

న్యూఢిల్లీ: రాబోయే పాతికేళ్లలో భారత్ అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఈ శతాబ్దంలో ఏదో ఒక దశలో నంబర్ వన్ స్థానానికి కూడా చేరుకుంటుందని అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ జోస్యం చెప్పారు. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ఆయన ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో  ఈ వ్యాఖ్యలు చేశారు.  1800 సంవత్సరానికి ముందు రెండు వేల ఏళ్ల పాటు ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఉన్న ఆసియాకే మళ్లీ ఆ ప్రాధాన్యం దక్కుతోందన్నారు. 

రాబోయే 25 ఏళ్లలో భారత్, చైనాలు తొలి రెండు స్థానాల్లో నిలుస్తాయని, అమెరికా మూడో స్థానానికి పడిపోతుందని చెప్పారు.  చైనా జనాభా క్రమంగా తగ్గుతుండగా.. 150 కోట్ల జనాభాతో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందని తెలిపారు.  

న్యూఢిల్లీ–బీజింగ్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక వాణిజ్యం, సాంకేతికత, చైనా పెట్టుబడుల ద్వారా భారత్ తన వృద్ధిని మరింత వేగవంతం చేసుకోవచ్చన్నారు. "భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చైనా ఎంత అవసరమో, చైనాకు భారత్ అంతే ముఖ్యం" అని స్పష్టం చేశారు.  క్వాడ్  నుంచి భారత్ బయటకు రావాలని సాక్స్ సలహా ఇచ్చారు.