ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ లోకి ఇండియన్ బ్యాంక్

ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ లోకి ఇండియన్ బ్యాంక్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్  త్వరలోనే  లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోకి ఎంటర్ అవ్వనుంది. 

త్వరలోనే ఈ అంశంపై  బోర్డు అనుమతి కోరనున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈఓ బినోద్ కుమార్ వెల్లడించారు. బలమైన భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్లు  లేదా అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా  ఈ వ్యాపారాల్లోకి ప్రవేశిస్తామని అన్నారు.   

భాగస్వామి ఎంపిక, రెగ్యులేటరీ అనుమతులకు ఏడాది సమయం పట్టొచ్చని అన్నారు.  యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇండియన్ బ్యాంక్‌‌కు 28.52శాతం వాటా ఉంది. అలహాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విలీనం చేసుకోవడం ద్వారా ఈ వాటా దక్కింది.