న్యూఢిల్లీ: భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌డీఏ) డ్రాఫ్ట్ ప్రకారం.. ఇండియన్ కంపెనీలు ఏటా 16.41 లక్షల టన్నుల (1.64 మిలియన్ టన్నులు) స్టీల్ ఎగుమతులను తక్కుక టారిఫ్ రేటుకే ఈయూకి ఎగుమతి చేయొచ్చు.
ఈ మొత్తం 16,41,470 టన్నుల్లో.. మోస్ట్ ఫేవోర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్) కింద 9,46,616 టన్నులు, ఎఫ్‌టీఏ (ఎఫ్‌టీఏ) కింద 6,94,853 టన్నుల ఉక్కును ఎగుమతి చేసుకునే వెసులుబాటు దక్కింది. ఈ కోటా పరిధి దాటి చేసే ఎగుమతులపై 50శాతం వరకు సుంకం పడే అవకాశముంది.
