పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజ్ 72వ ఫౌండేషన్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కాలేజీలోని ఆలుమ్ని అసోసియేషన్ హాల్లో సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి.ఆర్. లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.వి. రత్నంల అధ్యక్షతన నిర్వహించిన ఈ సంబరాలకు పూర్వ విద్యార్థులు, లెక్చరర్లు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ముఖ్య అతిథులుగా వచ్చిన అసోసియేషన్వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ డి.రాజారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ఇందిర, సూపరింటెండెంట్ డాక్టర్ తోట ఉషారాణి జ్యోతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వక్తలు మాట్లాడుతూ.. గాంధీ వైద్య కళాశాల దశాబ్దాలుగా పేద ప్రజలకు వైద్య సేవలందిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన డాక్టర్లను సమాజానికి అందించిందని కొనియాడారు. భావి డాక్టర్లు సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలిచిన 42 మంది మెరిట్ స్టూడెంట్లకు గోల్డ్‌మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు.
