2 గంటల్లోనే 13 తులాల బంగారం చోరీ.. వనస్థలిపురం పీఎస్పరిధిలో ఘటన

2 గంటల్లోనే 13 తులాల బంగారం చోరీ.. వనస్థలిపురం పీఎస్పరిధిలో ఘటన
  • షాపింగ్ కు వెళ్లొచ్చేసరికి ఎత్తుకెళ్లిన దుండగులు

ఎల్బీ నగర్, వెలుగు: ఓ కుటుంబం షాపింగ్ కు వెళ్లొచ్చేసరికి 3 గంటల వ్యవధిలోనే దుండగులు 13 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి చోరీ చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది. సచివాలయ నగర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్​వేర్ ఉద్యోగి వెంకట హరీశ్​ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్ కు వెళ్లాడు. 

3 గంటలకు తిరిగి ఇంటి రాగా తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని  బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కొంత నగదు కనిపించలేదు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని వెంకట హరీశ్​వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.