బేగంబజార్, వెలుగు: బేగంబజార్‌లోని ఫీల్‌ఖానాలో పంచలోహంపై 24 క్యారెట్ల బంగారు పూత, 3.8 లక్షలకు పైగా అమెరికన్ వజ్రాలు పొదిగి తయారు చేసిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఇత్తడి ఉన్న ప్రాంతంలో బంగారు పూత పూయగా, విగ్రహం వెనక భాగంలో దశావతారాలను, పైభాగంలో తిరుపతి బాలాజీ నమూనాలను కళాత్మకంగా తీర్చిదిద్దారు.
ఫీల్‌ఖానాలో ఇదే ప్రదేశంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వరుసగా ఇది మూడోసారి అని, సుమారు రూ.50 లక్షలు ఖర్చయ్యిందని నిర్వాహకులు ఆధార్, నిఖితేశ్ తెలిపారు. సుమారు 48 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని 8 మంది కళాకారులు 8 నెలల పాటు రూపొందించారని చెప్పారు.
11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తామని, అయితే ఈ విగ్రహాన్ని కాకుండా, దీని స్థానంలో మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తామని ప్రకటించారు.
