ఖార్తూమ్: ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వెస్ట్ కార్డోఫాన్ స్టేట్‌లో ఓ బంగారు గని కుప్పకూలింది. దీంతో 67 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద డజన్ల కొద్దీ కార్మికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. అల్-నుహుద్‌కు వాయవ్యంగా ఉన్న ఫౌజా ప్రాంతంలోని అల్-జారా గనిలో షాఫ్ట్‌లు (సొరంగాలు) ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి.
కార్డోఫాన్ అబ్జర్వేటరీ తెలిపిన వివరాల ప్రకారం.. గని ఒక్కసారిగా కుప్పకూలడంతో భారీ సంఖ్యలో కార్మికులు చనిపోయారు. భూగర్భంలో కొందరు కార్మికులు ఇంకా బతికి ఉండే అవకాశం ఉందని, వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని ఈ సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
