ఆసియా క్రీడలకు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ దూరం

ఆసియా క్రీడలకు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ దూరం

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల కోసం ప్రకటించిన ఇండియా క్రికెట్‌‌ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న మిస్టరీ స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తి ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతని స్థానంలో యంగ్‌‌ లెగ్‌‌ స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ విప్రాజ్‌‌ నిగమ్‌‌ను జట్టులోకి తీసుకున్నారు. అఫ్గానిస్తాన్‌‌తో జరిగిన తొలి టీ20లో వరుణ్‌‌కు పక్కటెముకల గాయమైంది.

ప్రస్తుతం అతను రిహాబిలిటేషన్‌‌లో ఉన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు ఆడిన 22 ఏళ్ల విప్రాజ్‌‌ ఐపీఎల్‌‌లో మెరుగైన ప్రదర్శన చూపెట్టాడు. 19 మ్యాచ్‌‌ల్లో 13 వికెట్లు తీశాడు. 176 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో బ్యాటింగ్‌‌ చేశాడు. ఈ నెల 19 నుంచి జపాన్‌‌లోని ఐచినగోయాలో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. 24 నుంచి మొదలయ్యే క్రికెట్‌‌ మ్యాచ్‌‌ల్లో ఇండియా డైరెక్ట్‌‌గా క్వార్టర్‌‌ఫైనల్లో బరిలోకి దిగనుంది.