సౌతాంప్టన్: కెప్టెన్ హ్యారీ బ్రూక్ (49 బాల్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 114 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో.. మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 119 రన్స్ తేడాతో శ్రీలంకపై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో హోమ్ టీమ్ 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 254/4 స్కోరు చేసింది.
అన్యూరిన్ డొనాల్డ్ (12) నిరాశపర్చినా.. జోస్ బట్లర్ (80), బ్రూక్ రెండో వికెట్‌కు 128 రన్స్ జత చేశారు. టామ్ బాంటన్ (14), విల్ జాక్స్ (21) మోస్తరుగా ఆడారు. దుష్మంత చమీరా, దునిత్ వెల్లలాగే, ఇషాన్ మలింగ, వానిందు హసరంగ తలా ఓ వికెట్ తీశారు.
ఛేజింగ్‌లో లంక 19 ఓవర్లలో 135 రన్స్‌కు ఆలౌటైంది. దునిత్ వెల్లాలగే (33) టాప్ స్కోరర్. డాసున్ షనక (24)తో సహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. బ్రూక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
