హైదరాబాద్ సిటీ, వెలుగు: కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు, మాదాపూర్ తమ్మిడికుంట అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం పరిశీలించారు. గణేశ్ నిమజ్జనానికి ఇబ్బందులు కలగకుండా ఐడీఎల్ చెరువు లోతును 25 అడుగులకు పెంచి, పూడిక తొలగించి నీటితో నింపినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆంజనేయనగర్‌లో 100 అడుగుల రహదారి ఆక్రమణలపై కమిషనర్ఆరా తీశారు. హైటెన్షన్ వైర్ల కింద బస్సుల పార్కింగ్‌గా మారుతున్న ఆక్రమణలను తొలగించి, రోడ్డును పునరుద్ధరించాలని ఆదేశించారు.
మాదాపూర్‌లోని తమ్మిడికుంటను సందర్శించిన ఆయన, వాకర్లతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆక్రమణల తొలగింపుతో 14 ఎకరాల నుంచి 30 ఎకరాలకు తమ్మిడికుంటను విస్తరించినట్లు తెలిపారు. మురుగు చేరకుండా, ప్లాస్టిక్ తొలగించి పర్యావరణాన్ని కాపాడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్కమిషనర్ ఆనంద్‌కుమార్, ఏసీపీ తిరుమల్ పాల్గొన్నారు.
