నందు, వెన్నెల కిశోర్, వైవా హర్ష లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘మగాళ్లు జిందాబాద్’. అనిల్ రావిపూడి దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన నార ప్రవీణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ ‘మగవాళ్ళ భావాలు, బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి చాలామంది ఆలోచిస్తారు. అలాంటి వారి కోసమే ఈ సినిమా. అంతేకానీ ఆడవాళ్లను తక్కువ చేయడం కాదు, ఆడవాళ్లు ఎప్పుడూ గ్రేట్. నిజ జీవితంలో మగవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఫన్నీగా చూపించబోతున్నాం’ అని చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ లక్ష్మీ దుర్గ థ్యాంక్స్ చెప్పింది. ఇదొక సెటైరికల్ కామెడీ ఫిలిం అని, అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని డైరెక్టర్ నార ప్రవీణ్ చెప్పాడు. ఈ చిత్రం ఇందులోని యాక్టర్స్ అందరికీ మంచి మైలేజ్ తీసుకొస్తుందని నిర్మాత ప్రసాద్ భాస్కర్ల అన్నారు.
