దీపావళికి ‘హత:’తో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్.. నవంబర్ 6న థియేటర్లలోకి మిస్టికల్ థ్రిల్లర్

దీపావళికి ‘హత:’తో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్.. నవంబర్ 6న థియేటర్లలోకి మిస్టికల్ థ్రిల్లర్

హీరోగానే కాక నిర్మాతగానూ వరుస చిత్రాలు నిర్మిస్తున్న కిరణ్‌‌ అబ్బవరం... ‘తిమ్మరాజుపల్లి టీవీ’ తర్వాత నిర్మిస్తున్న సినిమా ‘హత:’.   పౌర్ణమి ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ శివశంకర నాయుడుతో కలిసి కిరణ్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుష్ గోరక్ దర్శకుడు.  కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న సినిమా విడుదల కానుంది. శుక్రవారం నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌‌లో నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఇందులోని  ప్రతి సీన్  నెక్స్ట్  ఏం జరుగుతుంది అనే ఆసక్తి, ఆద్యంతం కొత్త ఫీల్ కలిగిస్తుంది.  

దీపావళికి మా మూవీ బెస్ట్ ఎక్స్‌‌పీరియన్స్ ఇస్తుంది’ అని చెప్పాడు.  ఈ కథను మాటల్లో చెప్పడం కంటే స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది అని నటి తనూజ చెప్పింది.  స్క్రిప్ట్ రైటర్, డీవోపీ, డైరెక్టర్ అనుష్ గోరక్ మాట్లాడుతూ ‘ఇదొక మిస్టికల్ థ్రిల్లర్. కొంత హారర్ ఉంటుంది. ఈ  కథలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అవి థియేటర్స్‌‌లోనే ఎక్స్‌‌పీరియన్స్ చేయాలి’ అని చెప్పాడు. నిర్మాత శివశంకర నాయుడు మాట్లాడుతూ  ‘ఏ ప్రాంతం వాళ్లు ఈ సినిమా చూసినా అది తమ దగ్గరే జరిగింది అనుకునేలా ఉంటుంది.  ఆడియెన్స్‌‌కు మంచి అనుభూతిని కలిగిస్తుంది’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.