ఇడుపులపాయ: వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్ తేదీలను ‘ఎక్స్’ వేదికగా ఏపీ పీసీసీ చీఫ్ ప్రకటించారు. సెప్టెంబర్ 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, అలాగే డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక జరగనుందని తెలిపారు.
ఈ శుభవార్తను దేవుడి ఆశీర్వాదంతో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పంచుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఇరు కుటుంబాలు ఇడుపులపాయలోని YSR ఘాట్ దగ్గర ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.
నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిశుద్ధ వివాహ మహోత్సవం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం. ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం.
— YS Sharmila (@realyssharmila) September 18, 2026
ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, అలాగే… pic.twitter.com/nibFyREPiY
డాక్టర్. సోమల రఘురామ్ రెడ్డి అనే అమెరికాలో స్థిరపడిన యువ వైద్యుడితో తన కూతురికి పెళ్లి ఫిక్స్ అయినట్లు షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మా రెడ్డి దంపతులు కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. వీళ్ల కొడుకే డాక్టర్. సోమల రఘురామ్ రెడ్డి. ఈ కుటుంబానికి అమెరికా పౌరసత్వం ఉంది. ఈ కుటుంబం ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడింది.
►ALSO READ | అక్టోబర్ 1న కృష్ణా బోర్డు మీటింగ్
