అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు... విచారణకు రావాలంటూ ఫోన్ ద్వారా సమాచారం..

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు... విచారణకు రావాలంటూ ఫోన్ ద్వారా సమాచారం..

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. సెప్టెంబర్ 11వ తేదీనే నోటీసుకు పంపినట్లు ఆయనకు ఈడీ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. తనకు ఏ నోటీసులు అందలేదని ఈడీ అధికారులకు తెలిపారు అంబటి. విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయనకు అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. పలు కేసుల్లో గతంలో అరెస్టైన అంబటికి ఈడీ నేరుగా నోటీసులు జారీ చేయడంపై చర్చనీయాంశంగా మారింది.

అంబటి రాంబాబు సుమారు పలు కేసులకు సంబంధించి సుమారు 18 రోజుల పాటు రిమాండ్ లో ఉన్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ALSO READ : తెలంగాణపై తీవ్రంగా ఎల్ నినో ఎఫెక్ట్

ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులను కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ తమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు.