అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని పలు మీడియా సంస్థలపై ఆంక్షలు విధించారు. తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని CNN, MS NOW , Politico మీడియా సంస్థలను వైట్ హౌజ్ వార్తలను కవర్ చేయకుండా నిషేధం విధించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న మరికొన్ని మీడియా సంస్థలపై కూడా త్వరలో నిషేధం విధిస్తామని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో రాసిన ఓ పోస్టులో వెల్లడించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వైట్ హౌస్‌లో CNN, MS NOW , Politico మీడియా సంస్థల ప్రవేశాన్ని తక్షణమే నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ఈ మూడు సంస్థలు నిరంతరం "ఫేక్ న్యూస్" ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ..ఈ సంస్థలు ఉద్దేశపూర్వకంగా తన ప్రభుత్వంపై ప్రతికూల కథనాలు ప్రచురిస్తున్నాయని అన్నారు. మరికొన్ని మీడియా సంస్థలపై కూడా చర్యలు ఉండొచ్చు అని హెచ్చరించారు.
CNN, Politico ఏమన్నాయంటే..
ట్రంప్ చర్యలను CNN, Politico తీవ్రంగా ఖండించాయి. ఇది మీడియాపై దాడి అని, వైట్ హౌస్ రిపోర్టింగ్‌కు రాజ్యాంగ పరిరక్షణ ఉందని, ఈ నిషేధం అమల్లోకి వస్తే అది మీడియాపై దాడిగా చట్టపరంగా సవాలు చేస్తామని తెలిపింది. Politico కూడా తాము నిష్పక్షపాత రిపోర్టింగ్ కొనసాగిస్తామని, తమ రాజ్యాంగ హక్కులను కాపాడుకుంటామని ప్రకటించింది.
ఈ నిషేధం ఎలా అమలు చేస్తారన్నది ఇంకా స్పష్టంగా లేదు. ఇది పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని ఇప్పటికే అమెరికాలోని పలు న్యాయ నిపుణులు, ప్రెస్ సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కూడా వైట్ హౌస్ మీడియాపై ఆంక్షల విషయంలో కోర్టు అమెరికా ప్రభుత్వాన్ని మందలించిన సందర్భాలు ఉన్నాయన్నారు.
