మియాపూర్మెట్రో స్టేషన్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్లో సిటీకి డ్రగ్స్

మియాపూర్మెట్రో స్టేషన్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్లో సిటీకి డ్రగ్స్
  • ఎండీఎంఏ అమ్ముతున్న పెడ్లర్​ అరెస్ట్​
  •     9 గ్రాములున్న 14 ట్యాబ్లెట్స్​స్వాధీనం 

మియాపూర్​, వెలుగు : మియాపూర్​మెట్రో స్టేషన్​ సమీపంలో ఎండీఎంఏ (ఎక్టసీ ట్యాబ్లెట్స్​)అమ్ముతున్న ఓ డ్రగ్​ పెడ్లర్​ను మియాపూర్​ పోలీసులు, ఈగల్​టీం అదుపులోకి తీసుకుంది. వారి నుంచి 9 గ్రాముల బరువున్న 14 ఎక్టసీ ట్యాబ్లెట్స్​స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పోలా సురేశ్ గోపి 2024లో గోవాలో రెంటల్ ప్రాపర్టీ బిజినెస్​స్టార్ట్​చేశాడు. డ్రగ్స్​ సరఫరా చేసే బాబా పరిచయం కావడంతో దందా మొదలుపెట్టాడు. ముంబయికి చెందిన డ్రగ్స్​పెడ్లర్​డానిష్ ఆలమ్ అన్సారీ కూడా పరిచయం కావడంతో అక్కడి నుంచి కూడా డ్రగ్స్​తెస్తున్నాడు. 

16న ముంబయికి వెళ్లిన గోపి..డానిష్ ఆలమ్ అన్సారీ నుంచి రూ. 22వేలకు 29 ఎక్టసీ ట్యాబ్లెట్స్​కొన్నాడు. అక్కడే 15 ట్యాబ్లెట్స్​అమ్మి 14 ట్యాబ్లెట్స్​ను ప్రైవేట్ ట్రావెల్స్​లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకువచ్చాడు. మియాపూర్​ మెట్రో స్టేషన్​వద్ద వీటిని అమ్మే ప్రయత్నంలో ఉండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల ద్వారా డ్రగ్స్ సేకరణ, రవాణా, సరఫరా పంపిణీతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు.  ఇతర నిందితులైన గోవాకు చెందిన బాబా, ముంబయికి చెందిన డానిష్ ఆలమ్ అన్సారీ పరారీలో ఉన్నట్లు తెలిపారు.