వీకెండ్ ఊహించని షాక్ ఇచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో రేట్లు ఎంత పెరిగాయంటే?

వీకెండ్ ఊహించని షాక్ ఇచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో రేట్లు ఎంత పెరిగాయంటే?

అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి రేట్లను ఊహించని రీతిలో పెంచేస్తున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఇటీవల పెంచిన నాటి నుంచి బులియన్ మార్కెట్లు మరింత దూకుడుగా మారాయి. అయితే ఇదే దూకుడు రానున్న మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు ఆర్థిక అనిశ్చితిలో సేఫ్  హెవెన్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచటమే దీనికి కారణంగా వారు చెబుతున్నారు. అయితే వీకెండ్ షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రేట్లను పరిశీలించటం మంచిది. 

సెప్టెంబర్ 19న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 18 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.142 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 584గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 285గా కొనసాగుతోంది. 

శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 19, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగి రూ.2లక్షల 50వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.