హైదరాబాద్, వెలుగు: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ రెండు రోజుల్లో 1.16 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. ఈ నెల 17 న ఓపెన్ అయిన కంపెనీ పబ్లిక్ ఇష్యూ 21 న ముగుస్తుందని సంస్థ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ దాదాపు 8.86 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా, 10.27 కోట్ల షేర్ల కోసం బిడ్స్ అందాయి. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.1,700–రూ.1,785 కాగా, కనీసం 8 షేర్లకు బిడ్ వేయాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, అరందా ఇన్వెస్ట్‌మెంట్స్ (మారిషస్) వంటి సంస్థలు 12.64 కోట్ల షేర్లను అమ్ముతున్నాయి. ఇందులో 3.78 కోట్ల షేర్లను ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.6,746 కోట్లకు విక్రయించాయి. తమ సంస్థపై ఉన్న కో–లొకేషన్, డార్క్ ఫైబర్ కేసులను సుప్రీంకోర్టు పరిష్కరించిందని , సెబీతో ఒప్పందాన్ని ఆమోదించిందని శ్రీరామ్ తెలిపారు.
