డీమానిటైజేషన్ ముగిసి దాదాపు పదేండ్లు కావస్తున్నా ఇప్పటికీ పాత కరెన్సీ నోట్లు బయట పడతున్నాయి. అక్రమంగా దాచుకున్న డబ్బుల కట్టలను మార్చుకోలేక.. అక్రమంగా చలమాణి చేస్తూ .. ఎట్టకేలకు పోలీసులకు చిక్కుతున్నారు కొందరు. లేటెస్టుగా కాజీపేటలో కోటి 38 లక్షల రూపాయల పాత నోట్లు పట్టుబడటం కలకలం రేపింది.
2026 సెప్టెంబర్ 19న కాజీపేటలో భారీగా రద్దు చేసిన పాత కరెన్సీ పట్టివేశారు పోలీసులు. రూ.1.38 కోట్లకు పైగా డీమోనిటైజ్డ్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ చలామణికి యత్నించిన 8 మందిని అరెస్ట్ చేశారు.
పాత రూ.500, రూ.1,000 నోట్లను అక్రమంగా చలామణి చేసేందుకు యత్నించిన 8 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి రూ.1,38,50,000 విలువైన రద్దు చేసిన పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. పాత నోట్లతో పాటు రూ.6 వేల ఒరిజినల్ కరెన్సీ, 10 సెల్‌ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.
