భీమదేవరపల్లి, వెలుగు: సోదరి సూసైడ్ చేసుకోవడంతో అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన చెల్లి కూడా ఆత్మహత్య చేసుకోదని గ్యారెంటీ ఏమిటని గురుకుల ప్రిన్సిపాల్ స్కూల్లో చేర్చుకోవడానికి నిరాకరించడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర డా.పి.వి.రంగారావు బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఇటీవల ఆమె సోదరి ముల్కనూర్లోని ఓ కాలేజ్లో ఇంటర్ చదువుతూ ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నది. అంత్యక్రియలు, దశదినకర్మ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శుక్రవారం విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. గురుకులం ప్రిన్సిపాల్వారితో మాట్లాడుతూ ‘మీ పాప ఆత్మహత్య చేసుకోదని గ్యారంటీ ఏందీ? అని, గతేడాది పాఠశాలలో ఓ విద్యార్థిని చనిపోయింది, టీసీ ఇస్తాం తీసుకెళ్లండని చెప్పింది. అప్పటికప్పుడు టీసీ ఇచ్చి గట్లనర్సింగాపూర్ స్కూల్కు రిఫర్ చేస్తామని, ఆఫీసర్లకు సమాచారం ఇచ్చామని అనడంతో తమ కూతురు భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థిని, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు.
