వరంగల్ : ఫ్రీ కోచింగ్‌‌ కు స్క్రీనింగ్ టెస్ట్ .. ఎస్ఐ, కానిస్టేబుల్‌‌ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

వరంగల్ : ఫ్రీ కోచింగ్‌‌ కు స్క్రీనింగ్ టెస్ట్ .. ఎస్ఐ, కానిస్టేబుల్‌‌ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

గ్రేటర్​ వరంగల్, వెలుగు: వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్‌‌ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ కోసం ఈ నెల 20న ఉదయం10-గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

ఈ టెస్ట్‌‌లో పాల్గొనలనుకునే అభ్యర్థులు https://forms.gle/eD2E5jNfiebo5prG8 గూగుల్ ఫామ్‌‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.  ఈ ఎగ్జామ్‌‌  వరంగల్- సీకేఎం కాలేజీ దేశాయిపేట, హన్మకొండ- ఎస్‌‌బీఎస్‌‌ కాలేజీ రామారాం, సీజేఐటీ ఇంజనీరింగ్ కాలేజీ జనగామ, పరకాల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, నర్సంపేట- బిట్స్​కాలేజీలో నిర్వహించనున్నట్లు తెలిపారు.