మిచిగాన్ లో అమెరికాకు చెందిన యుద్దవిమానం F16 కూలిపోయింది. గురువారం ( సెప్టెంబర్ 17) గ్రాండ్ టవర్స్ కౌంటీలోని ట్రావర్స్ సమీపంలో శిక్షణలో ఉన్న టెక్సాస్ ఎయిర్ నేషనల్ గార్డ్ ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ కూలిపోయిందని , పైలట్ సురక్షితంగా బయటపడ్డారని టెక్సాస్ నేషనల్ గార్డ్ 149 ఫైటర్ వింగ్ ప్రతినిధులు ధృవీకరించారు. ప్రస్తుతం పైలట్లకు చికిత్స అందిస్తున్నారు.
అమెరికా సైన్యం 1979 నుంచి F-16 విమానాలను వినియోగిస్తోంది. తరుచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎయిర్ ఫోర్స్ సేఫ్టీ సెంటర్ ప్రకారం..2000 నుంచి F-16 విమాన భారీ ప్రమాదాల్లో ఇదొకటి. ఈ ప్రమాదాన్ని 14 క్లాస్ ఎ గుర్తించారు .2 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా నష్టం,విమానం పూర్తిగా ధ్వంసమైనప్పుడు, సైనికుడు మరణించినప్పుడు సాధారణంగా క్లాస్ ఎ ప్రమాద హోదాను ఉపయోగిస్తారు.
ఇంతకుముందు గత డిసెంబర్ లో దక్షిణ కాలిఫోర్నియా ఎడారిలో అమెరికా యుద్ద విమానాల్లో ఉన్నత శ్రేణి థండర్ బర్డ్స్ దళానికి చెందిన F16 సి ఫైటింగ్ ఫాల్కన్ కూలిపోయింది. ఈ ప ప్రమాదంలో కూడా పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
