CSIR ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు .. డైరక్ట్ ఇంటర్వ్యూ..రాత పరీక్ష లేదు.. వివరాలు ఇవే..!

CSIR ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు .. డైరక్ట్ ఇంటర్వ్యూ..రాత పరీక్ష లేదు.. వివరాలు ఇవే..!

సీఎస్ఐఆర్ - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్​బీటీ), పాలంపూర్ వివిధ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 7.
విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్ 5, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2. 
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, ఎంఎస్సీ 
పూర్తిచేసి ఉండాలి. రీసెర్చ్ అనుభవం తప్పనిసరి.   
వయసు: 35 ఏళ్లు మించకూదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30. 

ALSO READ : రైల్వేలో జాబ్స్.. పారామెడికల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ihbt.res.inను సందర్శించండి.