నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గన్ మిస్ ఫైర్.. ఆర్ఐ సతీష్ మృతి

నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  గన్ మిస్ ఫైర్.. ఆర్ఐ సతీష్ మృతి

నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం ఉదయం సమయంలో తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ మృతి చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం. 

అయితే ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.