ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సస్పెన్షన్.. 17 రోజుల వ్యవధిలో ముగ్గురిపై వేటు

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సస్పెన్షన్.. 17 రోజుల వ్యవధిలో ముగ్గురిపై వేటు

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్​పరిధిలోని జల్ది పల్లి ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ శేఖర్​ రెడ్డిపై సస్పెన్షన్​ వేటు పడింది. జల్దిపల్లి బీట్​పరిధిలో అడవుల నరికివేత, అటవీ భూములు ఆక్రమణలు జరుగుతున్నా శేఖర్​రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా అటవీ అధికారి నీరజ్ ​కుమార్ ​టిబ్రేవాల్ ​సీరియస్​గా పరిగణించారు. దీంతో శేఖర్ ​రెడ్డిని సస్పెండ్ ​చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎల్లారెడ్డి ఫారెస్ట్​ రేంజ్​అధికారి రమేశ్​ గురువారం తెలిపారు.

17 రోజుల్లో ముగ్గిరి సస్పెన్షన్

ఎల్లారెడ్డి ఫారెస్ట్​ రేంజ్​పరిధిలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అటవీ సిబ్బంది 17 రోజుల వ్యవధిలో సస్పెండ్​ కావడం జిల్లాలో హాట్​టాపిక్​గా మారింది. యంత్రాలతో చెట్ల నరికివేత, ట్రాక్టర్లతో అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడాన్ని  సీరియస్​గా తీసుకున్న డీఎఫ్ వో.. 17 రోజుల వ్యవధిలో శెట్​పల్లి బీట్​ఆఫీసర్ శ్యాంసుందర్, జల్దిపల్లి బీట్ ఆఫీసర్​ శేఖర్​రెడ్డి, బొల్లారం ఫారెస్ట్​ సెక్షన్ ​ఆఫీసర్ విక్కీమార్టిన్​పై సస్పెన్షన్​ వేటు వేశారు.