పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష.. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు తీర్పు

పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష.. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు తీర్పు

యాదాద్రి, వెలుగు : రెండేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక ఫాస్ట్​ ట్రాక్​ పోక్సో కోర్టు తీర్పు వెలువరిచింది. వివరాల్లోకి వెళ్తే.. 2021 అక్టోబర్​ 31న తుర్కపల్లి మండలానికి చెందిన రెండండ్ల బాలిక పక్కింటికి వెళ్లింది. ఆ బాలికపై యువకుడు ధీరావత్​ నవీన్​ లైంగిక దాడి చేశాడు. దీంతో ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. తల్లి విషయం గమనించి కూతురును ప్రశ్నించి లైంగిక దాడి జరిగిన విషయం తెలుసుకుంది. మరుసటి రోజు తుర్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు సాక్షాలు సేకరించి కోర్టులో చార్జ్​షీట్​ దాఖలు చేశారు. అన్ని పరిశీలించిన స్పెషల్​ ఫాస్ట్​ ట్రాక్​ పోక్సో కోర్టు నిందితుడికి ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.