- సమస్యలు, సంక్షేమ అంశాలపై చర్చ
- ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు శోభన్రెడ్డికి ఆహ్వానం
తార్నాక, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, వారి హక్కులు, గుర్తింపు, సంక్షేమ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 27న యాదగిరిగుట్ట లోని లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఆర్కే భూపాల్ తెలిపారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్ రెడ్డిని కోరారు. గురువారం ఉద్యమకారులతో కలిసి తార్నాకలోని ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమకారుల సంఘాల ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
